ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పీలేరు సర్పంచ్ షేక్ జీనత్ షఫీ అన్నారు. మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా పీలేరు సచివాలయం ఒకటిలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో 561మందికి వైద్య నిపుణులతో చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.