కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, గ్రూప్ బి ఉద్యోగులు, పారామిలటరీ, ఆర్మీ ఉద్యోగులకు దీపావళి బోనస్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గరిష్ఠంగా ఉద్యోగులు రూ.7 వేల వరకు బోనస్ అందుకోనుండగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి ఉద్యోగంలో చేరి 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్ పొందేందుకు అర్హులు అని కేంద్రం ప్రకటించింది.