ప్రవాస భారతీయుల ఆర్థిక సాయంతో బుధవారం ఒంగోలులో ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు, నూతన వస్త్రాలతో పాటు నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా పలు ప్రాంతాల్లో 300 మందికి పైగా అనాధలకు అన్నదానం చేశారు. ఫౌండేషన్ చైర్మన్ థామస్ పాల్గొన్నారు.