ఒంగోలులోని ఉమామహేశ్వర కళాశాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్ఎస్ యూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవల్యూషన్ స్టూడెంట్స్ జిల్లా అధ్యక్షులు ఈదుపల్లి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు దసరా సెలవులు పూర్తయిన వెంటనే కళాశాలలో చేరని ఎడల రూ. 200 నగదు చెల్లించాలని విద్యార్థులకు నోటీసులు ఇచ్చిందన్నారు. దీంతో వెంటనే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.