దేశ రాజధాని ఢిల్లీలోని అన్ స్కిల్డ్ , సెమీ స్కిల్డ్, స్కిల్డ్ కార్మికుల కనీస నెలవారీ వేతనాలను పెంచుతూ ఢిల్లీ కార్మిక మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ గురువారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.ఈ ఉత్తర్వులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.అధిక ద్రవ్యోల్బణం మరియు ఇతర కారణాల వల్ల ఆర్థిక సవాళ్లు తీవ్రం కావడంతో సమాజంలోని అన్ని వర్గాలపై ప్రభావం చూపిందని మంత్రి అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ కనీస వేతనాల పెంపు కార్మికులకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. దేశంలోనే అత్యధిక కనీస వేతనాలు ఢిల్లీలో ఉన్నాయని మంత్రి అన్నారు.