హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో ఇరువైపులా 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాధినేతలు స్పందించి వెంటనే దాడులను ఆపాలని సూచించారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ఫోన్ లో మాట్లాడారు. గాజాలోని అల్పై అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగినందుకు సంతాపం వ్యక్తం చేశారు.