ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ వేద పండితులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమను సమర్పించారు. సీఎం వెంట పలువురు వైసీపీ నేతలు, అధికారులు ఉన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఇంద్రకీలాద్రిపై ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.