న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్ల రూపాయలను వెదజల్లుతోందని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా? మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురంధేశ్వరి గారు?. వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా?’ అని ప్రశ్నించారు.