రాయదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో వెలసిన సవదత్త రేణుక ఎల్లమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం ఎనిమిదవ రోజు అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ అలంకరణలో భక్తులకు కనువిందు చేసింది. పురోహితులు రాజన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి విశేషాలంకరణను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.