ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మండల ప్రత్యేక అధికారి రమణ అన్నారు ఆదివారం కొల్లూరు మండల పరిధిలోని పోతర్లంక గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో సత్యనారాయణ మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మురాల రాంబాబు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.