కోడిపందాల స్థావరాలపై రేపల్లె పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. రేపల్లె రూరల్ మండలం బేతపూడి శివారులో మంగళవారం కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారంతో దాడి చేసి ఏడుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 14, 310 రూపాయల నగదు రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.