కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో కృష్ణా నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లికి ఉయ్యూరు మండలం మంటాడకు చెందిన పసుపులేటి మణికంఠ అనే భక్తుడు 1, 80, 000 విలువ చేసే బంగారం, వెండి, పట్టుతో కూడిన చీరను దేవస్థాన అధికారులకు మంగళవారం నాడు అందజేశారు. మణికంఠ దేవాదాయ శాఖ అధికారులకు ఈ చీరను అందజేయగా, భక్తుడు బహుకరించిన చీరను అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల జయ పార్థసారథి అలంకరించారు