కొండపల్లిలోని శాంతినగర్ శివారు ప్రాంతంలో మూటలో మృతదేహం లభ్యం కావడంతో మంగళవారం స్థానికంగా సంచలనం కలిగించింది. మొదట ఒక మహిళ మృతదేహం అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో ఒక్కసారిగా శాంతినగర్ వాసులు భయాందోళనకు గురైయ్యారు. మూటలో మృతదేహం ఉన్నట్లు సమాచారంతో పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా మృతదేహం మహిళ కాదని మగ వ్యక్తిని పోలీసులు తెలిపారు.