స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించి 63,148కి చేరుకుంది. నిఫ్టీ 264 పాయింట్లు నష్టపోయి 18,857 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (1.74%), ఐటీసీ (0.35%), హెచ్సీఎల్ (0.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.10%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-4.06%), బజాజ్ ఫైనాన్స్ (-3.54%), ఏషియన్ పెయింట్స్ (-3.36%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.16%), నెస్లే ఇండియా (-2.81%).