జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు వచ్చే నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వరప్రసాద్ గురువారం తెలిపారు. 2024 2025 సంవత్సరానికి సంబంధించి ఆయా గ్రామాల్లో చేపట్టవలసిన ఉపాధి పనులపై గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ పంచాయతీల అనుమతులు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ సభల్లో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొనాలని సూచించారు.