గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) యురాలజీ వార్డులో రూ. రెండు కోట్ల పరికరాన్ని ఆప్తమాలజీ వార్డులో మూలనపడేసిన ఉదంతం గురువారం వెలుగుచూసింది. ఆపరేషన్ అవసరం లేకుండా కిడ్నీలో రాళ్లు తొలగించే ఈ మిషన్ అందుబాటులో లేకపోవడంతో యూరాలజి వార్డుకు వస్తున్న రోగులకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ దృష్టికి రావడంతో ఆయన పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa