డెంకాడ మండలం,గునుపూరు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాల్ బాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సుమారు 5000 రూపాయల విలువ చేసే బ్యాట్స్, బాల్స్ ను శుక్రవారం అందజేశారు.పాఠశాల గణిత ఉపాధ్యాయిని మహంతి పద్మజ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని పుష్పలత ఈ బహుమతులను అందజేసినట్లు ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమారి తెలిపారు.ఈ సందర్బంగా సిబ్బందికి వ్యాయామ ఉపాధ్యాయులు గౌరీ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa