హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత, ఆయనను శుక్రవారం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి ఐజీఎంసీ ఆస్పత్రిలో చేరిన ఆయన కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది.ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో కొన్ని పరీక్షల కోసం ముఖ్యమంత్రిని తరలించినట్లు అధికారిక ప్రతినిధి తెలిపారు. ఐజీఎంసీ, సిమ్లా, వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రిని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన సరైన విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరగా కోలుకుంటున్నారని ఆయన తెలిపారు.