ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ధ్వజ స్థభం భూలోకానికి, స్వర్గలోకానికి మధ్య వారధి. అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది. అనంతమైన విశ్వంలో ఉండే దివ్వశక్తులను, కాస్మిక్ కిరణాలను దేవాలంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. ద్భజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండి రక్షిస్తుంది. అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వల్ల అది విద్యుత్ శక్తిని గ్రహించి, భూమిలోకి పంపించివేసి ఆలయాన్ని కాపాడుతుంది.