కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు చనిపోవటం ఘోరమా? లేక బెంగళూరు వెళ్లడం ఘోరమా? అన్నది రామోజీరావు స్పష్టంచేయాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబునాయుడే 29 మందిని చంపేశారని.. ఘోరం అంటే అది అని కొడాలి నాని తెలిపారు. ఏపీ కార్మికులు కర్ణాటకలో చనిపోయిన ఘటనపై ఈనాడులో రామోజీరావు ‘ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా? అంటూ రాసిన కథనంపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు.