రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల బంధువులు కొందరు జైలు అధికారులుగా వుండడం అనుమానంగా ఉందన్నారు. చంద్రబాబు భద్రత..ఆరోగ్యం విషయంలో కచ్చితంగా కుట్ర జరుగుతోందన్నారు. కోర్టుకి చంద్రబాబు రాసిన లేఖలో అన్ని అంశాలు నిజమేనన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా వైసీపీదే బాధ్యత అని వర్మ పేర్కొన్నారు.