ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ దీపావళికి టెంకాసి నుంచి ప్రయాగ్‌రాజ్-వారణాసి-గయా-రామేశ్వరం వరకు ప్రయాణించేలా స్పెషల్ ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఈ యాత్ర 9 పగళ్లు, 8 రాత్రులు ఉంటుంది. వచ్చే నెల 9న యాత్ర ప్రారంభం కానుంది. ప్యాకేజీలో వసతి ఖర్చులు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సదుపాయం కలదు. పూర్తి వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌కు సంప్రదించగలరు.