అమెరికాలో ఓ మహిళ దారుణ హత్యలకు పాల్పడింది. ఒహియోలోని కొలంబస్లో పురుషులు వరుస హత్యలకు గురయ్యారు. దీని వెనక ఒహియోకు చెందిన రెబెక్కా ఆబోర్న్ (33 ఏళ్లు) అనే మహిళ హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రెబెక్కా.. మగాళ్లతో శారీరకంగా కలిసి ఆ తర్వాత మత్తు మందు ఇచ్చి చంపేసేది. ఆ తర్వాత వారి దగ్గరి నుంచి డబ్బులు, నగలు దోచుకునేది. ఇలా నాలుగు హత్యలు చేసిందని పోలీసులు తెలిపారు.