గుండెపోటు వచ్చి తాను చనిపోయినా ప్రయాణికులను కాపాడి వారికి ఊపిరి పోశాడో బస్సు డ్రైవర్. ఈ ఘటన గత రాత్రి ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా ఒక్కసారిగా అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచే ముందు డ్రైవర్ బస్సును గోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సు గోడకు ఢీకొని నిలిచి పోవడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.