ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. దసరా ఉత్సవాలు చూసేందుకు 15 ఏళ్ల మైనర్ బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి వెళ్లింది. ఇంటికి వెళ్లే క్రమంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి వదిలేసి వెళ్లిపోయారు. బాలిక మేనమామ ఆమెను గుర్తించి బాధిత తల్లికి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదని బాధిత తల్లి ఆరోపించింది.