వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. కసంపూర్ వద్ద రైలు వస్తున్న క్రమంలో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. ఆ సమయంలో పట్టాలుదాటేందుకు 40 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రయత్నించారు. వేగంగా వచ్చిన వందేభారత్ రైలు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.