భారత్, పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ నిబందనలకు విరుద్దంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అక్రమ చొరబాట్లు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ను భారీగా సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉన్నకాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తోంది. దీంతో జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలు ఆర్నియా సెక్టార్లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న బంకర్లలో తలదాచుకోవడానికి శుభ్రం చేసుకుంటున్నారు.