జగనన్న ఆరోగ్య సురక్ష లో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు ధర్మవరం ఎస్బిఐ కాలనీ సచివాలయం పరిధిలోని నెహ్రూనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21వ వార్డు ఇంచార్జి కత్తె పెద్దన్న, కంటి వైద్య అధికారి ఉరుకుందప్ప, సీఓలక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు.