భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ సారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. నాలుగు రోజుల్లో ఇది మూడో బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. కాగా, అక్టోబర్ 27, 28 తేదీల్లో కూడా అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మొదట్లో రూ.20 కోట్లు నుంచి రూ.200 కోట్లు డిమాండ్ చేశారు.