అనారోగ్య కారణాలతో చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ లభించింది. ఈ సందర్బంగా హైకోర్టు చంద్రబాబుకు పలు కండీషన్లు పెట్టింది. స్వేచ్చగా తన ఇంట్లో ఉండవచ్చని, చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లవచ్చని తెలిపింది. రాజకీయ సమావేశాల్లో కానీ, నేతలతో భేటీలో కానీ పాల్గొనవద్దని తెలిపింది. బాబు వెంట ఇద్దరు డీఎస్పీలను ఉంచాలని, అతనికి ఉన్న జడ్ ప్లస్ భద్రతను యధావిధిగా కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది.