యాడికి మండలం పిన్నేపల్లి గ్రామంలో చిన్నపాటి విషయంపై సోమవారం రాత్రి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొండారెడ్డి, రామేశ్వర్ రెడ్డి, కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల వారు కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన రామేశ్వర్ రెడ్డి, సుదర్శనమ్మ, కొండారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కొరకు తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.