కనగానపల్లి మండలంలోని మామిళ్ళపల్లిలో నిర్వహిస్తున్న అర్చన ఎరువుల దుకాణ యజమాని వేణుగోపాల్ రెడ్డిపై మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమారి మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎరువుల దుకాణం ముందు నిబంధనల ప్రకారం పిఎం కిషన్ బోర్డ్ ఏర్పాటు చేయాలి. అలా చేసి ఉంటే ఫోటో తీసి వ్యవసాయ అధికారుల గ్రూపులో జత చేయమని కృష్ణకుమారి కోరారు. ఈ విషయంలో అసభ్యకర వాయిస్ మెసేజ్ లు చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.