ప్రస్తుత భీమిలి నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలమంచిలి సూర్య నారాయణ పదవి కొద్ది రోజుల్లో ముగిస్తున్న తరుణంలో మరలా అదే పదవులు కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మంగళవారం భీమిలి ఎమ్మెల్యే కార్యాలయంలో ఎలమంచిలి సూర్యనారాయణ కు అందజేశారు. తన పనితనాన్ని గుర్తించి మళ్లీ ఇదే పదవి కొనసాగిస్తున్నారని అవంతి కు సూర్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.