ఏపీలోని శ్రీశైల క్షేత్రంలో నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తికమాసోత్సవాలు నిర్వహించనున్నారు. రద్దీ కారణంగా కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించే కుంకుమార్చన రద్దు చేసినట్లు వెల్లడించారు.