గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీని చెప్పవద్దని కార్వేటినగరం ఎస్ఐ దస్తగిరి చెప్పారు. బుధవారం కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుశాఖ సహకారంతో సైబర్ నెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడు తూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఓటీపీలు, పాస్ వర్డ్లు ఎవరికి షేర్ చేయవద్దని తెలిపారు.