మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే క్రమంలో రాజకీయాలకు అతీతంగా సాధ్యమైనంత ఎక్కవగా నిధులు తీసుకువస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. గురువారం కొండపల్లి మున్సిపాలిటీలోని భీమరాజు గుట్టలో రూ. 25 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాదు ప్రారంభించారు.