ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ‘ఛత్తీస్గఢ్ ఆత్మగౌరవం’ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు ఆ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తేచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 47% ఓట్లతో 55-60 సీట్లు, బీజేపీ 42% ఓట్లతో 28-34 సీట్లు, బీఎస్పీ 1-2 స్థానాలు పొందే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది.