విశాఖపట్నం 75వ వార్డు సీతానగరంలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో చంద్రబాబు చిత్రపటానికి బుధవారం రాత్రి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయ కులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి, నాయకులు పెద్దాడ సోమునాయుడు, మాజీ కార్పొరేటర్ కన్నారావు, నాయకులు ములకలపల్లి పెంటయ్య, టి.పెంటయ్య, పెరుమాళ్లు ఉరుకూటి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa