ఉగ్రవాద చర్య ఎప్పటికీ ఆమోదయోగ్యమైనది కాదని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇటలీలోని రోమ్‌లో విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిషన్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ఉగ్రవాద చర్యే అని తెలిపారు. దీనిని ఎవరు ఒప్పుకోరని, అలాగే పాలస్తీనా సమస్యకు తగిన పరిష్కారం చూపాల్సిన అవసరముందని అన్నారు.