ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ విభాగం పీహెచ్డీ కోర్సు ఫీజు పెంపుదలపై విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తంచేశారు. గతేడాది రూ.1,932గా ఉన్న ఫీజును యూనివర్సిటీ రూ. 23,968కి పెంచింది. దీంతో ఫీజును ఒకేసారి ఏకంగా 12 రెట్లు పేంచడం ఏంటని ప్రశ్నించారు. అయితే దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫీజు పెంపు నిర్ణయం విద్యను ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ చేయడమేనని డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ విమర్శించింది.