టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తన కుమారుల్లో ఒకరికి భారతదేశానిక చెందిన అమెరికా శాస్త్రవేత్త పేరు పెట్టారు. ఆయన కొడుకు పేరులో 'చంద్రశేఖర్' అని చేర్చారని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. బ్రిటన్ లో జరుగుతోన్న మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ భద్రతా సదస్సుకు భారత్ ప్రతినిధిగా కేంద్ర మంత్రి రాజీవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎలాన్ మస్క్ ను కలిశానని తెలిపారు.