సీఎం జగన్ తన చేతిలో ఉన్న సీఐడీ ద్వారా చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు సహా మాజీ మంత్రులందరినీ జైలుకు పంపుతామని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. ఏపీలో జగన్‌కు అనుకూలంగా ప్రజాస్వామ్యం ఉంది. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏపీ లిక్కర్ స్కాం జరిగింది. జగన్.. వైసీపీ నేతలు ఇసుకను భారీగా దోచేశారు. మేం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే.. మాపై కేసులు పెడతారా..? దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయి అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.