రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని ఒక్క అడుగు కూడా దాటిపోకుండా చేస్తానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదంటూ కొట్టిపారేశారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కనీసం చర్చ కానీ, అజెండా కానీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఊహాజనితంగా రాసిన వార్తలుగా అవి ఉన్నాయి.. వంద, రెండు వందల సంవత్సరాలకు రాని జిల్లా కేంద్ర అవకాశాన్ని సీఎం వైయస్ జగన్ మాకు కల్పించారు.. ప్రజల దీవెనలు, ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాయచోటి జిల్లా కేంద్రంగా యథావిధిగా కొనసాగుతుందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు.