విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై ఈరోజు(శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం వెల్లడించారు. పిటీషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని సుప్రీం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పందించారు.