వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ జరపనున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైయస్ఆర్సీపీ నేతలు మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొనున్నారు.