వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో రూ. 800 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని 21వ డివిజన్లో రూ. 24 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అనంతపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.