వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైద్య, ఆరోగ్య రంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. సీఎం జగన్ అసమర్థ పాలనలో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూది సైతం అందుబాటులో లేదని మండిపడ్డారు. నాగార్జునసాగర్ సమీపాన గల విజయపురి ఆస్పత్రి ప్రాంగణంలో చెట్లకింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.