బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. "అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి" అని ధర్మాన వ్యాఖ్యానించారు.