హమాస్‌పై ప్రతీకారంతో ఇజ్రాయెల్ భూతల, వైమానిక దాడులకు పూనుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో నిన్న ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ దౌత్యవేత్తలు, పాలస్తీనా అథారిటీ అధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దాడుల గురించి తెలుపగా స్పందించిన బ్లింకెన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపడితే అప్పుడు హమాస్ చెలరేగిపోతుందని తేల్చి చెప్పారు.