నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డ్ కు చెందిన ముడుగు దేవయ్య అనే యువకుడు వాలంటీర్ గా పనిచేస్తూ కరోనా సమయంలో బైక్ ఆక్సిడెంట్ లో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ మేరకు ఆదివారం 5 లక్షల రూపాయలు చెక్కును దేవయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.